అంగన్‌వాడీ అమ్మలతో చిన్నారుల గళం

అంగన్‌వాడీ అమ్మలతో చిన్నారుల గళం

ప్రజాశక్తి-యంత్రాంగం సమస్యలపై సమ్మె బాట పట్టిన అంగన్‌వాడలకు కేంద్రాల్లో పిల్లల తల్లిదండ్రులు బాసటగా నిలిచారు. పలు కేంద్రాల వద్ద తమకు అంగన్‌వాడీలే కావాలని వారికి మద్దతుగా నిలిచారు. అంగన్‌వాడీల సమ్మె ఆదివారం రోజుకు చేరుకుంది.  పెదపూడి మండల కేంద్రంలో లబ్ధిదారులు వారి చిన్నారులతో కలిసి అంగన్వాడీలు మద్దతుగా ఆందోళన చేపట్టారు. సిఐటియు నేత రాజేశ్వరి ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మిరియాల రాజేశ్వరి, కనకదుర్గ, సత్యవతి, భారతి పాల్గొన్నారు.పెద్దాపురం మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్దకు అంగన్వాడీ కేంద్రాల సేవలు పొందుతున్న లబ్ధిదారులు వచ్చి అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా తాము ఎన్నో సేవలు పొందుతున్నామన్నారు. వారి సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు దాడి బేబీ మాట్లాడుతూ ఆరు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు సరి కదా నిర్బంధాలను ప్రయోగించి అణచివేయాలని చూస్తోందన్నారు. సమ్మె శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపిన తల్లులకు, మహిళలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమల, ఎస్తేరురాణి, నాగమణి, వరలక్ష్మి, ఫాతిమా, కుమారి, స్నేహ, వనకుమారి, వసంత, లోవకుమారి, లలిత, స్నేహలత, టిఎల్‌.పద్మావతి పాల్గొన్నారు.తాళ్లరేవు సచివాలయాల సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించడం వల్ల తమ చిన్నారులు కేంద్రానికి వెళ్లడానికి ఇష్టపడడం లేదని, సచివాలయ సిబ్బంది వద్దని, అంగన్వాడీలే కావాలని విద్యార్థుల తల్లులు కాప శిరీష, రెడ్డి వెంకటలక్ష్మి, పద్మశ్రీ, మహాలక్ష్మి, లోవమ్మ తెలిపారు. అంగన్వాడీలకు ఆయా కేంద్రాల తల్లులు వారి చిన్నారులతో కలసి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కేంద్రాలు నిర్వహించడం తగదన్నారు. తమ అంగన్వాడీ టీచరు, ఆయా కావాలని పిల్లలు మారాం చేస్తున్నారని వారు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. సమ్మెకు టిడిపి నాయకులు మందాల గంగ సూర్యనారాయణ, ఉంగరాల వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వెంటనే సమ్మెను విరమింప చేయాలన్నారు. లేనియెడల టిడిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు, దూలిపూడి వెంకటరమణ, పొన్నమండ రామలక్ష్మి, నిమ్మకాయల మూర్తి, గంజా సూరిబాబు, కట్ట త్రిమూర్తులు, శ్రీను రాజు, కుడుపూడి రామకష్ణ, ప్రజా సంఘాల నాయకులు టి.ఈశ్వరరావు, వి.రాజు బాబు పాల్గొన్నారు.పిఠాపురం అంగన్వాడీ సెంటర్ల పిల్లల తల్లులు సమ్మె శిబిరం వద్ద తమ పిల్లలతో కలిసి వచ్చి మద్దతు తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించి సెంటర్లు తిరిగి తెరుచుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. తమ బిడ్డల అలనా పాలనా చూసుకునే అంగన్వాడీలు వారి సమస్యలపై ఇలా రోడ్డుమీద ఆందోళన చేయడం బాధాకరమన్నారు. తొలుత సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె.అప్పలరాజు, ఎఐటియుసి నాయకులు శాఖా రామకృష్ణ మద్దతు తెలిపారు. డి.పద్మ, సిఐటియు నాయకులు కె.చిన్న, డి.తులసి, అమల, నాగగణిక, కమలా రాణి, గౌరీ, భవాని, నళిని పాల్గొన్నారు.కాకినాడ అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కోశాధికారి ఎం.రమణమ్మ అధ్యక్షతన శిబిరాన్ని ప్రారంభించారు. తొలుత ఎంఎల్‌షి షేక్‌ సాబ్జికి ఘనంగా నివాళులర్పించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజకుమార్‌, కోశాధికారి ఎం.రమణ, నగర అధ్యక్షుడు పి.వీరబాబు మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే న్యాయమైన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యలను పరిష్కరించే వరకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పిడిఎఎం నాయకులు గంగరాజు, అయితాబత్తుల రామేశ్వరరావు, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి చంద్రమళ్ల పద్మావతి నర్ల ఈశ్వరి, బిజెపి నాయకులు గట్టి సత్యనారాయణ, టిడిపి మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి అంగన్‌వాడీలకు మద్దతు ఇచ్చారు. శ్రీవల్లి, ఎ.సీతాదేవి, ఎం.ఆండాలు, కె.వసంత, వై.రమాదేవి, నాగమణి, డి.ప్రేమ వసుధ, లీలావతి పాల్గొన్నారు. కాజులూరు అంగన్వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు అన్నారు. కాజులూరు పంచాయతీ వద్ద సమ్మె శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ సమ్మెలో వరలక్ష్మి, హనుమావతి, అన్నవరం, మామిడి ప్రసన్న, జొన్నలగడ్డ సరోజిని, సలాది లక్ష్మి, నందికోళ్ల నాగమణి, శేషారత్నం పాల్గొన్నారు. కరప శిబిరంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషు బాబ్జి పాల్గొని మద్దతు తెలిపారు. ఎం.వీరవేణి, ఎస్‌.వరలక్ష్మి, నారాయణమ్మ, భవాని, కల్పలత, పి.లక్ష్మి, ఎ.దేవి, బి.మనోజ, సాయి దుర్గ, జ్యోతి సిఐటియు నాయకుడు రామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️