అంగన్‌వాడీ కార్యకర్త పరిస్థితి విషమం

Dec 24,2023 23:43
గ్రామానికి చెందిన

ప్రజాశక్తి – కరప

మండలం గురజనాపల్లి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఎం.మంగాదేవి శనివారం రిలే నిరాహార దీక్షలో కూర్చుని సాయంత్రం ఇంటికి వెళ్లింది. ఇంటికెళ్లిన వెంటనే ఆమె ఒక్కసారిగా పడిపోవడంతో కుటుంబీకులు ఆమెను 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించిందని వైద్యం అందించేందుకు వైద్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ అంగన్‌వాడీ కార్యకర్తగా గుర్తించి రిలే నిరహారదీక్షలో ఉన్నారని వైద్యులకు వివరించారు. దీంతో ఆమెకు ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం కుటుంబీకులు ఆమెను ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రయివేటు ఆసుపత్రిలో ఐసియులో వైద్య చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఆమె భర్త ఎం.సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం వారిపై నిరంకుశంగా వ్యవహరిస్తుందని, వారు సమస్యల పరిష్కారం కోసం రోడ్డున పడి ప్రాణాల మీదకు తెచ్చుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్‌ అంగన్వాడి సెక్టార్‌ నాయకురాలు. పి.వీరవేణి మాట్లాడుతూ 13 రోజుల నుంచి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తీరు ఇప్పటికీ వరకు మారలేదన్నారు.

➡️