అండర్‌-17 బాస్కెట్‌ బాల్‌ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

పట్టణానికి చెందిన క్రీడాకారులు బాస్కెట్‌బాల్‌ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి విజయం సాధించినట్లు కోచ్‌, సీనియర్‌ పిడి డాక్టర్‌ వాకా నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో అండర్‌-17 విభాగంలో 67వ అంతర్‌ జిల్లా పోటీల్లో నూజివీడు బాలుర జట్టు ప్రథమ స్థానం, బాలికల జట్టు ద్వితీయ స్థానంలో గెలుపొందారన్నారు. పట్టణ ప్రముఖులు క్రీడాకారులను అభినందించారు.

➡️