అంతర రాష్ట్ర టి20 క్రికెట్‌ పోటీలకుసంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ జట్టుకు ఆహ్వానం

సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌

ప్రజాశక్తి పరవాడ: ఈ నెల 26 నుండి 29 వరకు హైదరాబాద్‌లో తెలంగాణ స్కూల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న అండర్‌ -17 బాలుర అంతరరాష్ట్ర టి20 క్రికెట్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు తమ పాఠశాల జట్టుకు ఆహ్వానం అందిందని సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ జి. మధు బాబు ఆదివారం తెలిపారు. ఈ సందర్బంగా సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌. సీతాలక్ష్మి మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ అంతరరాష్ట్ర స్కూల్‌. స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన ఆధారంగా తమ పాఠశాల జట్టుకు ఈ అవకాశం లభించిందని, దీన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాల జట్టును జోగేంద్ర నాయుడు, ఆర్యన్‌ సోని, మోహిత్‌,జ్యోతీశ్వర్‌, ఫైజాన్‌, శాశ్వత్‌ కుమార్‌, జె.తేజస్‌, సాహస్‌ బాలు, సిద్దార్థ్‌, మూలీజీ, శరన్‌ ప్రీత్‌, తేజస్‌ పటేల్‌లతో ఎంపిక చేశారు. కోచ్‌గా బషీర్‌ వ్యవహరిస్తారు. అంతరరాష్ట్ర పోటీలకు ఎంపికై గ్లోబల్‌ సంస్కృతి క్రికెట్‌ జట్టును పాఠశాల సిఇఒ కె. నిశంత్‌ అభినందించారు.

సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌ క్రికెట్‌ జట్టు ఇదే

➡️