అందరికీ న్యాయం చేయండి – ఆర్‌డిఒకు సుగుమంచిపల్లె వాసుల వినతి

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ గండికోట ప్రాజెక్టు ద్వారా నష్టపోతున్న సుగుమంచిపల్లె గ్రామ ప్రజలందరికీ న్యాయం చేయాలని ఆగ్రామ ప్రజలు ఆర్‌డిఒ జి. శ్రీనివాసులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం వారు ఆర్‌డిఒ కార్యాలయంలో ఆర్‌డిఒను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ముంపునకు గురైన 22 గ్రామాలలో తమ గ్రామం ఒకటన్నారు. కొంత గ్రామాన్ని ముంపునకు కేటాయించి, మిగిలిన కొంత భాగానికి కేటాయి ంచలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు వల్ల నీటి ఊటలు ఇళ్లల్లో పడుతు న్నాయని, మహిళలు మరుగుదొడ్లు వాడుకోలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఈనేపథ్యంలో సుగుమంచిపల్లి గ్రామాన్ని కలెక్టర్‌, ఆర్‌డిఒ, తహశీల్దార్‌ తమ గ్రామాన్ని సందర్శించారని చెప్పారు. గత డిసెంబర్‌ 26న తహశీల్దార్‌ గ్రామంలోని ప్రతి ఇంటినీ పరిశీలించి అందరి పేర్లు రాసుకున్నారని పేర్కొ న్నారు. మళ్లీ విఆర్‌ఒ పెద్దన్న, ఆయన బృందం వచ్చి ఒక లిస్టు ఆర్‌డిఒ కార్యా లయం నుంచి వచ్చిందని చెప్పి అందులో ఉన్న వారి నుంచి బాండుపై సంత కాలు తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. లిస్టులో చాలా మంది పేర్లు రాలేదని, అందరికీ న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఆర్‌డిఒ గండిక ోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన గ్రామాల మాదిరి మీ గ్రామానికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వడం లేదన్నారు. ప్రాజెక్టు నిండా నీరు నింపడం వల్ల ఇబ్బందులకు గురవుతున్న కుటుంబాలను, ఇళ్లను పరిశీలించి గుర్తించిన వారికి కలెక్టర్‌ మానవతా దక్పథంతో స్పెషల్‌ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం దష్టికి తీసుకొని వెళ్లారన్నారు. ఆ మేరకు తాము పని చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలోని వారందరూ ముంపు గ్రామాల మాదిరిగా తమకు కూడా నష్టపరిహారం చెల్లించాలని, ఇళ్లను సర్వే చేయించాలని, ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తి ప్యాకేజీ ఇవ్వాలని కోరుతుండడంతో ప్రస్తుతం పూర్తిగా లిస్టును నిలిపేయడం జరుగుతుందన్నారు. ఏ ఒక్కరికి ఒక్క పైసా కూడా ఇవ్వమన్నారు. మళ్లీ మొదటి నుంచి సర్వే చేసి బాధితులకు న్యాయం చేయమని కలెక్టర్‌ ఆదేశిస్తే తర్వాత మీ గ్రామానికి వస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు వీర శేఖర్‌ రెడ్డి, గోవర్ధన్‌, చంద్ర శేఖర్‌ రెడ్డి వెంకట కష్ణారెడ్డి, సిద్దయ్య, రాజు, ప్రసన్న, భాస్కర్‌, సురేంద్ర, చిన్నా, బి.రామాంజనేయులు పాల్గొన్నారు.

➡️