అంబేద్కర్‌ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి

ప్రజాశక్తి- వెలిగండ్ల : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్‌ విగ్రహానికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ముక్కు మహాలక్ష్మమ్మ మాట్లాడుతూ గర్భిణులు ,బాలింతలు, 0 నుంచి ఆరు సంవత్సరాలు లోపు పిల్లలకు అంగన్‌వాడీలు వివిధ రకాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ వారికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించటం లేదన్నారు. అంగన్‌వాడీలకు ఇస్తున్న గౌరవ వేతనాలతో వారు జీవనం గడపటం కష్టంగా ఉందన్నారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించపోతే ఈ నెల నుంచి సమ్మెబాట పట్టనున్నట్ల తెలిపారు. సిఐటియు జిల్లా నాయకుడు రాయల మాలకొండయ్య మాట్లాడుతూ అంగన్‌వాడీలపై యాప్‌ల భారాన్ని తగ్గించాలన్నారు. అంగన్‌వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు వెంకటశ్రీలక్ష్మి, ఎ. నారాయణమ్మ, టి.ప్రమీల, మాదిరెడ్డి బాలనాగమ్మ, నాగేశ్వరమ్మ, రమాదేవి, ఈశ్వరమ్మ, మల్లేశ్వరి, దీనమ్మ, మరియమ్మ, గూడూరు సలోమి, పవిత్ర పాల్గొన్నారు. యర్రగొండపాలెం : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఇఒఆర్‌డి ఈదుల రాజశేఖర్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు మల్లేశ్వరి, పద్మావతి, రామకుమారి, రూత్‌మేరి, రామ సుబ్బమ్మ, నసీమా, షంషాద్‌, విజయలక్ష్మి, రవణ, అంజమ్మ పాల్గొన్నారు. శింగరాయకొండ : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 8 నుంచి సమ్మెబాట పట్టనున్నారు. అందులో భాగంగా అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టంగుటూరి రాము, కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మోజస్‌, పేముల బాబూరావు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు షేక్‌కమీరునిషా, రత్నకుమారి పాల్గొన్నారు.జరుగుమల్లిలో.. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని జరుగుమల్లిలో అంబేద్కర్‌ విగ్రహనికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు బెల్లం శేషమ్మ, కె.హేమలత, విజయలక్ష్మి, టీ.విజయ, వరమ్మ, సిఐటియు నాయకులు మోజెస్‌ తదితరులు పాల్గొన్నారు.కొండపిలో.. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్‌ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల యూనియన్‌ నాయకులు ఆదిలక్ష్మి, ఆర్‌. విజయనిర్మల, పి.ఆదిలక్ష్మి, సరితాదేవి, శేషమ్మ, మస్తానమ్మ, ప్రమీల, రంగమ్మ పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్‌ : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల యూనియన్‌ నాయకురాలు డి. స్వర్ణ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి. ఆవులయ్య, సిఐటియు నాయకుడు ఎస్‌కె. అన్వర్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు కొండమ్మ ,ఆదిలక్ష్మి, మున్నా, సోములు బారు ,భారతి, కష్ణకుమారి పాల్గొన్నారు.

➡️