అత్యాధునిక టెక్నాలజీ ఆర్వి డిజిటల్స్‌ సొంతం

Dec 7,2023 21:11
ఆర్వీ డిజిటల్స్‌లో నూతన యంత్రాన్ని ప్రారంభిస్తూ..

అత్యాధునిక టెక్నాలజీ ఆర్వి డిజిటల్స్‌ సొంతంప్రజాశక్తి-తిరుపతి(మంగళం):అత్యాధునిక టెక్నాలజీతో వినియోగదారులకు కంపెనీ ఉత్పత్తులను ఆకర్షణీయ రీతిలో డిజిటల్‌ డిజైన్స్‌ ప్రింటింగ్‌ చేసి పబ్లిసిటీ ఇస్తున్న ఆర్వి డిజిటల్స్‌ దేశంలోని మొట్టమొదటిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో ఫుజీ ఫిలిం సంస్థ రూపొందించిన రెఓరియా ఈసీ 1100 నూతన యంత్రాన్ని ప్రారంభించింది. గురువారం తిరుపతి-కరకంబాడి మార్గంలోని మంగళం రవాణా శాఖ కూడలి వద్ద గల ఆర్వి డిజిటల్స్‌ ప్రధాన కార్యాలయంలో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధాకష్ణ, ఫుజి ఫిలిం సంస్థ ప్రతినిధులు హాజరై రెఓరియా ఈసీ 1100 నూతన యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్వి డిజిటల్స్‌ ఎండి రాధాకష్ణ మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల అనుభవంతో డిజిటల్‌ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్వి డిజిటల్స్‌ లో తగిన మార్పులు చేసుకుంటూ ప్రారంభించిన మూడున్నర సంవత్సరాలలోనే తిరుపతి నుండి రాయలసీమ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేట్‌ సంస్థలకు సంబంధించిన గ్లో సైన్‌ బోర్డ్స్‌, ఎల్‌ఈడి బోర్డ్స్‌, ఫ్యాబ్రిక్‌ బోర్డ్స్‌, షోరూం డిస్ప్లే, క్లాడింగ్‌ వర్క్స్‌, కంప్లీట్‌ బ్రాండింగ్‌ లను ఆర్వి డిజిటల్స్‌ లో తయారు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ డిజిటల్‌ కేంద్రంలో లేనివిధంగా ఆర్‌ వి డిజిటల్స్‌ లో ప్రపంచంలోనే పేరుగాంచిన ఫుజి ఫిలిం సంస్థ రూపొందించిన అత్యాధునిక టెక్నాలజీతో రెఓరియా ఈసీ 1100 యంత్రాన్ని 60 లక్షల వెచ్చించి జపాన్‌ దేశం నుండి దిగుమతి చేసుకున్నామన్నారు. ఈ యంత్ర సహాయంతో ఒక నిమిషానికి 100 షీట్లను ఆకర్షణీయంగా డిజిటల్‌ ప్రింటింగ్‌ చేయొచ్చన్నారు. ఇప్పటివరకు దాదాపు మూడు కోట్ల రూపాయలకు విలువైన నూతన టెక్నాలజీతో కలిగిన డిజిటల్‌ ప్రింటింగ్‌ ఎక్విప్మెంట్‌ ను ఆర్వి డిజిటల్స్‌ లో వినియోగిస్తున్నామన్నారు. యజమానిలా కాకుండా కార్మికులు అందరితో కలిసి ఖచ్చితమైన నైపుణ్యతతో వినియోగదారుల సంతప్తే లక్ష్యంగా ఆర్వి డిజిటల్స్‌ పనిచేస్తుందన్నారు. ఆర్వి డిజిటల్స్‌ సేవలు ఉపయోగించుకుంటూ వ్యాపార అభివద్ధి చేసుకోవాలని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధాకష్ణ విజ్ఞప్తి చేశారు.ఆర్వీ డిజిటల్స్‌లో నూతన యంత్రాన్ని ప్రారంభిస్తూ..

➡️