అధికారరలోకి వస్తే టూరిజం అభివృద్ధి

Mar 8,2024 21:49
ఫొటో : మాట్లాడుతున్న పొన్నెబోయిన చెంచల బాబు

ఫొటో : మాట్లాడుతున్న పొన్నెబోయిన చెంచల బాబు
అధికారరలోకి వస్తే టూరిజం అభివృద్ధి
ప్రజాశక్తి-ఉదయగిరి : తెలుగుదేశం అధికారంలోకి రాగానే టూరిజం అభివృద్ధి చేస్తామని మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచల బాబుయాదవ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఘటిక సిద్ధేశ్వర క్షేత్రాన్ని పర్యాటక గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తానని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఘటిక సిద్ధేసనాన్ని దర్శించుకొని మండల నాయకులతో తెలుపుతూ ఎంతో విశిష్టత కలిగి ప్రకృతి రమణీయత ఉన్న ఘటిక సిద్ధేశ్వర క్షేత్రాన్ని అభివృద్ధి పరచడమే తన ధ్యేయమన్నారు. పర్యాటక గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. అక్కడ ఉన్న మండలస్థాయి ప్రముఖ నాయకుల అందరితో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం బయల్దేరి వెళ్లి ప్రకాశం జిల్లా భైరవకోనలోని శివాలయంలో ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ ఉగ్ర నరసింహారెడ్డి, మాగుంట రాఘవరెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజలు ఆయన పాల్గొన్నారు. ఆయనవెంట ఉదయగిరి, సీతారాంపురం మండలలాల కన్వీనర్లు బయన్న, ప్రభాకర్‌, మాబాషా, చల్ల కొల్చు రమణయ్య, అంబటి మస్తాన్‌, భాస్కర్‌ రెడ్డి, బొగ్గవరపు మాలకొండయ్య, శివ నాయకులు అభిమానులున్నారు.

➡️