అధికారులుఫుల్‌ … రోగులు నిల్‌

Mar 30,2024 21:30

ప్రజాశక్తి – వీరఘట్టం : మండల కేంద్రంలోని నాలుగో సచివాలయ పరిధిలోనే ఆర్‌సిఎం పాఠశాల వద్ద శనివారం నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వైద్యులు ఫుల్‌గా ఉన్నప్పటికీ రోగులు లేక వెలవెలబోయింది. ఈ కారణంగా రోగుల్లేక వైద్య సిబ్బంది గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడపాదడపా వచ్చే రోగులకు వైద్యాధికారి పి.ఉమామహేశ్వరి వైద్య తనిఖీలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమ ంలో వైద్య సిబ్బందితో పాటు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు శివ్వాంలో ఆరోగ్య సురక్ష గరుగుబిల్లి : మండలంలోని శివ్వాంలో శనివారం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ కెకె సాగర్‌ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరానికి వచ్చిన రోగుల ఆరోగ్య సమస్యలను అడిగి వారికి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. అలాగే గర్భిణులకుు హిమోగ్లోబిన్‌, బిపి, షుగర్‌ పరీక్షలు చేసి రక్తం తక్కువగా ఉన్న వారికి ఐరన్‌ టాబ్లెట్‌ ఇస్తూ ఆహారంలో తగు జాగ్రతలు తీసుకోవాలని, హిమోగ్లోబిన్‌ పెరిగి నంత వరకూ పర్యవేక్షణ చేయాలని సిబ్బందికి సూచించారు. చెవి, ముక్కు, వైద్యులు, కంటికి సంబంధిత తనిఖీలను చేశారు. దీర్ఘకాలిక రోగాలు, 60పై బడిన బాలింతలు, చిన్న పిల్లలలు వచ్చిన వారికి కావాల్సిన వైద్య పరీక్షలు, మందులు అందజేశారు. అలాగే ఆర్‌బిఎస్‌కె అధికారి రఘు శిబిరానికి వచ్చి పర్యవేక్షి ంచారు. కార్యక్రమంలో స్పెషలిస్ట్‌ వైద్యులు ఎస్‌.కోటేశ్వరరావు, సూపర్వైజర్‌ చిన్నమ్మ, రమణమ్మ, ఉదయకుమారి, వైద్య సిబ్బంది, 104 దుర్గాప్రసాద్‌, శివ, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

➡️