అధికార, ప్రతిపక్షాలు మేల్కోవాలి

ప్రజాశక్తి-కడప ప్రతినిధిబిజెపితో లోపాయికారీ పొత్తు ద్వారా వ్యతిరేక ఫలితాలు తథ్యమని తెలంగాణా ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి లకు తెలంగాణా ఎన్నికల ఫలితం కనువిప్పు కలిగించి ఉంటుంద న్నారు. తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ సర్కారు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నప్పటికీ ఓటమి పాలు కావాల్సి రావడాన్ని గమ నించాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంక్షేమాల్ని ఏదో ఒక్కదాన్ని నమ్ము కుంటే మునగడం ఖాయమని తేలిపోయిందని చెప్పారు. రాష్ట్రంలోని వైసిపి సర్కారు కూడా సంక్షేమ పేరుతో ముందుకెళ్తోందని, సంక్షేమం ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం అసాధ్యమని తెలిపారు. ఎపిలో మార్పు రావడం తథ్యమన్నారు. అయితే టిడిపి స్వతంత్రంగా వ్యవహరిస్తే ఎన్నికల్లో ఫలితం లభిస్తుందన్నారు. బిజెపితో పొత్తు కారణంగా మైనార్టీ, ప్రొగ్రెసివ్‌, సెక్యులర్‌, డెమోక్రటిక్‌, అభ్యుదయ, శాం తికాము కులు, విద్యాధికారుల ఓట్లను నష్టపోతారని హెచ్చ రించారు. బిజెపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిం దన్నారు. పోలవరం మొదలు కుని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ వరకు అన్యా యం చేసిందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సిపిఎం సీట్లు కావాలని ఎవరినీ అడగ బోదని, బిజెపి వ్యతిరేక పార్టీలతో అవగాహన మేరకు ఎంపిక చేసుకున్న నియోజక వర్గాల్లో స్వతం త్రంగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. అధికార వైసిపిని ఓడించాలంటే బిజెపితో సంబంధాల కారణంగా సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కరువు సహాయక చర్య లు లేవని విమర్శించారు. కడపలో ప్రభుత్వ రంగంలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మిం చాలని ఉద్యమిస్తే జిందాల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుకు చొరవ తీసుకున్నప్పటికీ, ఎటువంటి పురోగతి లేదన్నారు. వైఎస్‌ జగన్‌ను నమ్మి రాయలసీమ అత్యధిక సీట్లను కట్టబెట్టి మోసపోయిందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి కల్పన అంశాల్లో నిరాశ పరిచిందన్నారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి అడిగిన దాఖలాల్లేవని విమర్శించారు. రాష్ట్రంలో బటన్‌ నొక్కుడు ద్వారా ఇచ్చినట్లే ఇచ్చి, ఇసుక, మద్యం, వ్యాట్‌ల పేరుతో లాగుకుంటున్నారన్నారు. కడప జిల్లాలో లక్షల ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నాయని, బినామీల చెరలో ఉన్న భూములను పేదలకు పంపిణీ చేయాలని కోరిన ఫిర్యాదును, ఫైలును మూలనపడేయడంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు కూడా కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో రూ.60 పెట్రోల్‌, వంట గ్యాస్‌ రూ.400, నిరుద్యోగభృతి సైతం ఇవ్వొచ్చనే పేరుతో రూప కల్పన చేసిన ప్రజాప్రణాళికను అమలు చేస్తామనే పేరుతో ఎన్నికల్లో కి వెళ్తామన్నారు. ఈమేరకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా క్యాంపెయి న్‌ చేస్తామని తెలిపారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపికి వ్యతి రేకంగా ఓట్లడగడానికి ప్రజాసంఘాలు ఇంటింటికీ వెళ్లే పనిలో ఉన్నాయన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్‌, రామ్మోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి పాల్గొన్నారు.

➡️