అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఎల్‌బిజి భవన్‌లో ఒంగోలు నగర అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ అసోసియేషన్‌ సమావేశం చందలూరు శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ ఒంగోలు నగర అపార్ట్‌మెంట్‌ వాచ్‌ మెన్‌ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటున్నాయన్నారు. ఒంగోలు నగరంలో 473 అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయని, ఇక్కడ పనులు చేయడానికి అనేక ప్రాంతాల నుంచి వలసలు వచ్చి చాలీచాలని జీతాలతో బతుకుతున్నారన్నారు. ఇంటి నివేశ స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారని, గతంలో ఇంటి నివేశన స్థలాల కోసం దరఖాస్తు పెట్టుకున్నా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఇంటి పనివార్లకు రోజువారీ వేతనం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రజక వత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టంగుటూరు రాము , రాయల మాలకొండయ్య, ఉపాధ్యక్షులు కోటేశ్వరావు, డాక్టర్‌ కష్ణయ్య, సహాయ కార్యదర్శి మంచికలపాట ిశ్రీనివాసులు,అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ జిల్లాకమిటీ ప్రధాన కార్యదర్శి సోరగుడి శ్రీనివాసులు , కమిటీ సభ్యులు కల్లగుంట శ్రీనివాసరావు, నాగేశ్వర నాయక్‌, మక్కెన అమరయ్య ,కొండలు, శోభన్‌ బాబు, శివ పాల్గొన్నారు.

➡️