అపోలో నూతన ఫార్మసీ ప్రారంభం

Feb 4,2024 15:43 #Kurnool

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు(కర్నూలు) : అపోలో ఫార్మసీ సేవలు అమోఘమని శిల్ప హాస్పిటల్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ శిల్ప, మధుమేహ వైద్య నిపుణురాలు డాక్టర్‌ జశ్విత చౌదరి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని హెచ్‌బిఎస్‌ కాలనీలో నాలుగవ అపోలో నూతన ఫార్మసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అపోలో ఫార్మసీ 24 గంటలు తెరిచి ఉంటుందని, అలాగే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి సేవలందిస్తుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అపోలో ఫార్మసీ సీనియర్‌ మేనేజర్లు మల్లికార్జున్‌ శెట్టి సుధాకర్‌ ఎగ్జిక్యూటివ్‌ సిబ్బంది ఆనంద్‌ చంద్రశేఖర్‌ ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

➡️