అప్రెంటీస్‌ విధానం తేవడం దుర్మార్గం: యుటిఎఫ్‌

ప్రజాశక్తి-పొదిలి: ఉపాధ్యాయ నియామకాలలో మరలా దుర్మార్గమైన అప్రెంటీస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం మంచి పద్ధతి కాదని, ప్రభుత్వం వెంటనే ఈ అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలని యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఉద్యోగ శాఖలో లేని వెట్టిచాకిరీ విధానాన్ని మరలా ప్రవేశపెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా డిఎస్‌సి నియామక ప్రతులను స్థానిక యుటిఎఫ్‌ భవనం వద్ద దహనం చేశారు. ఉపాధ్యాయుల నియామకాలలో అన్ని ఉద్యోగాల లాగా నేరుగా నియామకం పొందే విధంగా ఉంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం యుటిఎఫ్‌ పొదిలి డివిజన్‌ డివిజన్‌ కార్యదర్శి పి బాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యుటిఎప్‌ జిల్లా సహాధ్యక్షులు అబ్దుల్‌ హై, పొదిలి మండల ప్రధాన కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, కొనకనమిట్ల ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, కొనకనమిట్ల గౌరవ అధ్యక్షులు యుద్ధం శ్రీనివాసులు, సీనియర్‌ నాయకులు చవళం వెంకటేశ్వర్లు, సంజీవరావు కాసు తిరుపతిరెడ్డి, తాళ్లూరు చిన్న బాబూరావు సుదర్శన్‌రెడ్డి, టీ నర్సింహారావు, శివారెడ్డి, వై గురవయ్య, సురేష్‌, సాల్మన్‌ మొదలగువారు పాల్గొన్నారు.

➡️