బర్డ్‌ ఫ్లూ నివారణకు శ్రీలంక చర్యలు

Jun 25,2024 07:04 #birdflu, #srilanka

కొలంబో: బర్డ్‌ ఫ్లూ కేసులు నమోదైన దేశాల నుండి జంతువులు, జంతు ఉత్పత్తుల దిగమతులను నిరోధించేందుకు శ్రీలంక చర్యలు చేపట్టిందని ఆ దేశ జంతు ఉత్పత్తుల, ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం తెలిపారు. అమెరికాకు చెందిన పశువులు తొలిసారిగా ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ బారిన పడ్డాయని ఆరోగ్యశాఖ డైరక్టర్‌ జనరల్‌ హెమాలి కొతాలావాలా విలేకరులతో అన్నారు. విదేశాల్లో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుని దేశంలోని వ్యవసాయ పరిశ్రమ, వినియోగదారుల ఆరోగ్యాన్ని పరి రక్షించేందుకు చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. దేశంలో ఏదైనా కేసు బయటపడితే వ్యాధి నియంత్రణ చర్యలు వెంటనే చేపట్టేందుకు అవసరమైన సన్నద్ధ్ధతను కలిగి ఉండాలని కింది స్థాయి సిబ్బందిని కోరారు. గత సంవత్సరం హెచ్‌5, హెచ్‌7, హెచ్‌9 బర్డ్‌ ఫ్లూ కేసులను గుర్తించే సామర్థ్యాన్ని శ్రీలంక అభివృద్ది చేసిందని అన్నారు.

➡️