అభివద్ధి పనులు వేగవంతం చేయండి

కడప : కడప నగరంలో జరుగుతున్న అభివద్ధి పనులను వేగవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు ప్రీతం రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజలకు అసౌకర్యం, ఇబ్బందులు పడకుండా రోడ్లు, డ్రెయినేజీ కాలువల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కోరారు. మాసాపేట సర్కిల్‌ నుంచి మార్కెట్‌ యార్డు వరకు జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన పరిశీలించారు. స్థానిక వ్యాపారవేత్తల సమ స్యలను అడిగి తెలుసు కున్నారు. మూడు నెలలుగా డ్రైనేజీ, రోడ్డు పనుల్లో జాప్యం వల్ల రూ.కోట్ల రూపాయల వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి యుద్ధ ప్రాతిప దికన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నాయకులు సంబంధిత అధికారులను కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్‌, మైనార్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్‌ మహమ్మద్‌ అలీఖాన్‌, మాజీ కార్పొరేటర్‌ రహమతుల్లా ఖాన్‌, సమాచార హక్కు చట్టం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి లక్ష్మయ్య, మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు పాలగిరి శివ, సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షులు మామిళ్ళ నరసింహులు పాల్గొన్నారు.

➡️