అభివృద్ధి పథంలో డి.కొల్లాం

Mar 13,2024 20:48

ప్రజాశక్తి- డెంకాడ: మండలంలోని ఢకొీల్లం పంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. గ్రామ సర్పంచ్‌ అప్పడా శివకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలో ఉన్న డి.కొల్లాం, కె.కొల్లం, ఆర్‌ ముంగినాపల్లి, రెడ్డిక పేట గ్రామాలు రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని గ్రామాల్లో సిసి కాలువలు, సిసి రోడ్లు, రచ్చబండలు ఇలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలనూ చేపడుతు న్నారు. పంచాయతీ పరిధిలో ఆర్‌ ముంగి నాపల్లిలో రూ.2.50లక్షలతో సిసి రోడ్లు, సిసి కాలువలు వేశామని కె. కొల్లాంలో రూ.65 వేలతో సిసి రోడ్డు, కాలువ నిర్మించామని సర్పంచ్‌ శివకృష్ణ తెలిపారు. రెడ్డిక పేట ఊరు మొత్తం సిసి కాలువలను రూ.6 లక్షలతో నిర్మించామన్నారు. ఆర్‌.ముంగనా పల్లిలో రామకోవెల నుంచి ఊరి చివరి వరకు రూ.2లక్షలతో త్వరలో సిసి రోడ్డు వేస్తామన్నారు. పంచాయతీ మొత్తం రెండున్నర సంవత్సరాల కాలంలో సుమారు రూ.25లక్షలతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. కె. కొల్లాం వెళ్ళడానికి సిసి రోడ్డుకు రెండు వైపులా సిసి గోడలు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సహకారంతో నిర్మించామన్నారు. పంచాయతీ అభివృద్ధికి మండల పరిషత్‌ నిధులు, పంచాయతీ నిధులను వినియోగించామని చెప్పారు. తమ పంచాయతీ అభివృద్ధికి ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు, ఎంపిపి బంటుపల్లి వెంకట వాసు దేవరావుకు, అధికారులు సహకరించారని తెలిపారు.

➡️