అమరజీవికి నివాళి

Dec 15,2023 21:21

ప్రజాశక్తి – పార్వతీపురం  :   ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిందని జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు తెలిపారు. శుక్రవారం పొట్టి శ్రీరాములు 71వ వర్థంతి సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేషకృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన ప్రాణత్యాగ ఫలితంగా భాషాప్రయుక్తరాష్టాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని జెసి తెలిపారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి ఎస్‌.కృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్‌ పాల్‌, మత్స్యశాఖ అధికారి తిరుపతయ్య, మార్కెటింగు ఎడి ఎల్‌. అశోక్‌ కుమార్‌, సివిల్‌ సప్లయి జిల్లా మేనేజర్‌ దేవుళ్ల నాయక్‌, నీటిపారుదల ఎస్‌ఇ వై.వి.రాజరాజేశ్వరి, జిల్లా కోపరేటివ్‌ అధికారి బి.సన్యాసినాయుడు, కలెక్టరు కార్యాలయ సూపరింటెండెంట్లు శ్రీరామూర్తి, రవికుమార్‌, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.సీతంపేట : అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు ఆదర్శనీయమని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. శుక్రవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎపిఒ రోసిరెడ్డి, ఇఇ సింహాచలం, డిప్యుటీ డిఎంహెచ్‌ఒ విజయపార్వతి, పిఎఒ హరికృష్ణ, ఎఎఒ విజయ రాణి, ఐటిడిఎ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.బాలికల ఆశ్రమ పాఠశాలలో వర్ధంతి వేడుకఆంధ్ర రాష్ట్రం సాధన కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభారు పటేల్‌ వర్ధంతి స్థానిక బాలికల ఆశ్రమం పాఠశాలలో నిర్వహించారు. వీరి చిత్ర పట్టాలకు డిప్యూటీ డిఇఇ లిల్లీరాణి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.బలిజిపేట : మండలంలోని పెదపెంకిలో నేతాజీ గ్రంథాలయం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి వేడుకలు శుక్రవారం నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఈర్ల సంజీవ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మిర్తివలసకు చెందిన వావిలపల్లి సన్యాసి నాయుడు, గొర్లె శ్రావణ్‌ కుమార్‌, సురగాలి సూర్య నారాయణ, చిరంజీవి, ఆచారి కోట, గౌరీనాధ్‌, పెంకి పరశురాం, డాక్టర్‌ శ్రీను, యువత పాల్గొన్నారు.వీరఘట్టం : మండలంలోని పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నడుకూరు, బొడ్లపాడులో జనసేన నాయకులు ఎం.పుండరీకం, జనసేన జానీలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో కె.పవన సాయి, సిహెచ్‌ గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️