అరెస్టులు అప్రజాస్వామికం: ఎంఎం కొండయ్య

ప్రజాశక్తి-చీరాల: తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని, రాష్టంలో జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో ప్రతిపక్ష పార్టీలపై రోజు రోజుకూ పోలీసుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య అన్నారు. టిడిపి నాయకుల అరెస్టులను వ్యతిరేకిస్తూ నిరసనగా స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఆయన మీడియాతో మాట్లా డారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే తమ పార్టీ శాసనసభ్యులకు అండగా వెళ్లాలని భావించి అందుకు అనుగుణంగా పిలుపు ఇస్తే అర్ధరాత్రి సమయంలో తెలుగు దేశం పార్టీ మహిళా నాయకులు ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇవ్వటం పలువురు నాయకులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం దారుణమని అన్నారు. తామేమైనా ఉగ్రవాదులమా లేక, తీవ్రవాదులమా అని విరుచుకుపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సీఎం జగన్‌ తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కోండ్రు రత్నబాబు, నరాల తిరుపతి రాయుడు, డేటా నాగేశ్వరరావు, సుబ్బలక్ష్మి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

➡️