అర్హులకు సంక్షేమ పథకాలు

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న జిల్లా జెసి , అధికారులు, తదితరులు

ప్రజాశక్తి-అమలాపురంఅ

ర్హులందరికీ సంక్షేమ పథాకలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి ఏ కారణం చేతనైన లబ్ధి పొందని వారికి మరో అవకాశం ద్వైవార్షిక పద్ధతిలో సంవత్సరానికి రెండు సార్లుకల్పించడం జరుగుతోందన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆగస్టు 2023 నుంచిడిసెంబర్‌ 2023 వరకు ఐదవ విడత ద్వైవార్షిక నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో వర్చువల్‌ విధానంలో జమ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్‌ మాట్లా డుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ఆ దిశగా పథకాల లబ్ధి అర్హులందరికీ చెందిన తర్వాత ఇంకా పొరపాటున ఏ కారణం చేతనైన పథకాలు అందని వారికి మరో అవకాశం కల్పించడం జరుగు తోందన్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసి సామాజిక తనిఖీ నిర్వహించి పారదర్శకంగా వివక్షకు తావు లేకుండా చిట్టచివరి లబ్ధిదారుని వరకు లబ్దిని చేకూర్చడం జరుగుతోందన్నారు. పేదరిక వర్గాలలో సామాజిక భద్రతతో పాటుగా సురక్షితమైన గౌరవప్రద మైన జీవనాన్ని అందించే ఉద్దేశ్యంతో పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. సమాజంలోని అత్యంత అట్టడుగు వర్గాలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు పలుసంక్షేమ పథకాలు పేద వర్గాలలో అన్ని కేటగిరీల వారికి బాసటగా నిలిచి భరోసా నిస్తున్నాయన్నారు. జనం చెంతకే సంక్షేమం, అర్హత ప్రామాణికంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకూడదని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, అర్హత ఉండీ ఎవరైనా, ఎక్కడైనా మిగిలి పోయిన సందర్భాల్లో మళ్లీ రీ వెరిఫికేషన్‌ చేసి వారికి కూడా పథకాలను వర్తింప చేసే బై యాన్యువల్‌ కార్యక్రమం ద్వారా ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తు న్నామన్నారు. ప్రజలకు తోడుగా నిలిచేలా ఈ యొక్క పథకం మంచి సంకేతాన్ని ఇస్తోందన్నారు.జిల్లా వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి1,223 మంది లబ్ధిదారులకు రూ.1,68,54,667, ఇబిసి నేస్తం పథకానికి సంబంధించి 102 మందికి రూ.15,30,000, వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా పథకం ద్వారా 87 మంది వధువులకు రూ.71,60,000, జగనన్న చేదోడు పథకం ద్వారా 429 మందికి రూ.42,90,00, వైయస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ద్వారా 178 మందికి రూ.17,80,000, వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కింద 178 మందికి రూ.26,70,000, వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కింద 6 మందికి రూ.1,44,000, వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కింద 69 మంది లబ్ధిదారులకు రూ.9,95,000 వెరసి జిల్లా వ్యాప్తంగా 2,272 మంది లబ్ధిదారులకు రూ.3,54,23,667 లు మెగా చెక్కు ద్వారా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు రాజు, డిఎల్‌డిఒ పి.విజయ థామస్‌, వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, హిత కారిణి సమాజం ఛైర్పర్సన్‌ కాశి బాలముని కుమారి, పురపాలక సంఘ ఛైర్పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్ర మణి, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️