అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

Jan 7,2024 21:52

ప్రజాశక్తి – కొమరాడ : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందజేస్తుందని స్థానిక ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రమైన కొమరాడ సచివాలయంలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పింఛను రూ.2750 నుండి రూ.3 వేలుకు పెంపు జరిగిందని, ఇది అవ్వాతాతలకు అండగా ఉంటుందన్నారు. ఆర్థికంగా మహిళలకు చేయూత ఇవ్వడానికి అనేక పథకాలు అందిస్తున్నారని చెప్పారు. పింఛనును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక అభ్యున్నతి దిశగా అడుగులు వేయాలన్నారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమంలో పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు వైఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ కానుక కింద రూ.3వేల పెన్షన్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి శ్యామల, జడ్పిటిసి ద్వారపురెడ్డి లక్ష్మి, వైస్‌ ఎంపిపిలు కె.అన్నపూర్ణ, శరత్‌ బాబు, మండల వైసిపి కన్వీనర్‌ ద్వారపురెడ్డి జనార్ధన, శెట్టి మధుసూదనరావు, కొమరాడ సర్పంచ్‌ సిరికి గంగమ్మ, తొడుము సర్పంచ్‌ నాగిరెడ్డి సింహాచలం, ఎంపిటిసి సభ్యులు ఎం.అశ్విని, ఎంపిడిఒ ఎం.మల్లికార్జునరావు, ఎంఇఒ జె.నారాయణస్వామి, ఎపిఒ బాలకృష్ణ, ఎనర్జీ ఎస్‌జె సోమేశ్‌ పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు. సాలూరు: పట్టణంలోని డబ్బివీధి కళ్యాణమండపంలో మండలంలోని పేదలకు మూడు వేల రూపాయల చొప్పున ఫించన్ల పంపిణీ కార్యక్రమం డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ఆధ్వర్యాన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక సంఖ్యలో పేదలకు ఫించన్ల పంపిణీ చేపడుతున్నది తమ ప్రభుత్వమేనన్నారు. వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి జి.రాములమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి, వైస్‌ ఎంపిపిలు రెడ్డి సురేష్‌, సువ్వాడ గుణవతి, ఎఎంసి చైర్‌పర్సన్‌ దండి అనంతకుమారి, మండల వైసిపి అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు, పెద్దింటి మాధవరావు, సువ్వాడ రామకృష్ణ, ఎంపిడిఒ జి.పార్వతి పాల్గొన్నారు.ఎంపిటిసి లకు బహుమతులు:మండలంలోని ఎంపిటిసి సభ్యులకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి డిప్యూటీ సీఎం రాజన్నదొర చేతులు మీదుగా బహుమతులు పంపిణీ చేయించారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆమె, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ బహుమతులు అందజేశారు.

➡️