అలరించిన రంగవల్లులు

Jan 16,2024 21:06
ఫొటో : విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి

ఫొటో : విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి
అలరించిన రంగవల్లులు
ప్రజాశక్తి-మర్రిపాడు : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్నారై కె.వి.రమణారెడ్డి సహకారంతో చిలకపాడు గ్రామంలో ముగ్గుల పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలోవిజేతలైన మహిళలకు మర్రిపాడు ఎస్‌ఐ పి.విశ్వనాథరెడ్డి చేతుల మీదుగా ఏడుగురికి రూ.2వేల చొప్పున రూ.14వేలు అందజేశారు. తిక్కవరంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలో విజేతలైన వారికి ఎంపిపి గంగవరపు లక్ష్మీదేవి, శ్రీనివాసులు నాయుడు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైసిపి సేవాదళ్‌ జిల్లా జాయింట్‌ సెక్రటరీ నారాయణస్వామి, యువ నాయకులు గంగినేని విజరుకుమార్‌, సచివాలయ కన్వీనర్‌ బోయపాటి నాగేశ్వరరావు, ముప్పాళ్ల తిరుపతి, బోయపాటి సుబ్బరాయుడు, పోతులూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మర్రిపాడు యూత్‌ ఆధ్వర్యంలో మహిళలకు యువకులకు నిర్వహించిన పలు ఆటల పోటీలలో విజేతులైన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో యూత్‌ గంగినేని ప్రసాద్‌, రిషి గ్రామస్తులు క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️