అలుపెరగని పోరాటాలు చేసిన సాబ్జి

Dec 21,2023 23:37
ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి అలుపెరగని

ప్రజాశక్తి – ఉండ్రాజవరం

రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి అలుపెరగని పోరాటం చేశారని యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు ఐ.రాంబాబు అన్నారు. గురువారం స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్‌ మండల శాఖ అధ్యక్షులు కె.వెంకటరత్నం అధ్యక్షతన సాబ్జి సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా సాబ్జి చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఎంఎల్‌సి సాబ్జి మృతి ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర విస్మయానికి గురిచేసిందన్నారు. ఉపాధ్యాయ ఉద్యమంలో సాబ్జికి ప్రత్యేక పాత్ర ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు ఎస్‌.లక్ష్మీనారాయణ, ఎస్‌.తాతా రెడ్డి, బి. రామారావు, కె.రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఆర్‌.ఫణి, వి.విశ్వ ప్రసాద్‌, ఎంవివిఎస్‌ఆర్‌.రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️