ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్లో గంజాయి కలకలం.. 7 గురు అరెస్ట్‌

Feb 23,2024 17:01 #Visakha

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : శ్రీకృష్ణదేవరాయ హాస్టల్‌ లో గురువారం అర్ధరాత్రి ఏడుగురు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఆంధ్ర యూనివర్సిటీ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ గా పని చేస్తున్న మహమ్మద్‌ ఖాన్‌ మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటాస్థలానికి చేరుకున్నారు. శ్రీ కృష్ణదేవరాయ హాస్టల్లో రూమ్‌ నెంబర్‌ 78 లో గంజాయి సేవిస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారు. యూనివర్సిటీ లో ఏంఎస్సి చదువుతున్న చదలవాడ దినేష్‌, దారా ప్రమోద్‌ లతోపాటు వారి బయట నుండి వచ్చిన స్నేహితులు వంగలపూడి జై సుమంత్‌, కారంపూడి సాయి గౌతమ్‌, బెహరా భార్గవ్‌ పాత్రో, బుడుగుర్తు దుర్గ ప్రసాద్‌ , జుట్టు కృష్ణ వంశీ లతో కలిసి గంజాయి సిగరెట్లు సేవిస్తుండగా వారిని అదుపులోకి తీసుకోవడం తో పాటు వారి వద్ద నుండి గంజాయి సిగరెట్లు, 5 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ సంఘటన కు సంభందించి శుక్రవారం మధ్యహ్నం ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసామని 3 వ పట్టణ పోలీసులు తెలిపారు.

➡️