ఆటల్లో ఎన్‌ఎస్‌ విద్యార్థినుల ప్రతిభ

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ ఆటలు పోటీల్లో ఎన్‌ఎస్‌ అగ్రికల్చరల్‌, హార్టికల్చర్‌ కళాశాల విద్యార్థినులు ప్రతిభను చూపారు. యోగిత, దేవదివ్యని, గోపిక, చందన, పూజితరెడ్డి, మాధురి, స్వప్న, పూజిత, లక్ష్మీ ప్రసన్న, జాహ్నవి వీరు గత నెల జనవరి 24న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ కాన్బెన్సీ లెవెల్‌లో వాలీబాల్‌ టోర్నమెంట్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జనవరి 31న నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫిబ్రవరి 3న ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ చేతుల మీదుగా మూడో బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా శనివారం కళాశాల చైర్మన్‌ నాదెళ్ల చంద్రమౌళి, కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఆర్‌విఎస్‌కె రెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారు బహుమతి సాధించేందుకు కృషి చేసిన ఫిజికల్‌ డైరెక్టర్‌ మహేష్‌ను అభినందించారు.

➡️