ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Dec 1,2023 21:55
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ చలానాలను రద్దు చేయాలని, అక్రమ జరిమానాలను విధించరాదని సిఐటియు జిల్లా అధ్యక్షులు జిబిఎస్‌ మణ్యం, ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో కార్మికులను ఆదుకోవాలన్నారు. తిరుపతి ఎంబి భవన్‌లో సిఐటియు జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా కార్యదర్శి తంజావూరు మురళి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జీబిఎస్‌ మణ్యం, వందవాసి నాగరాజు మాట్లాడుతూ ఆటో అండ్‌ ట్రాలీ వెహికల్స్‌ కార్మికులందరూ ఐక్యంగా ముందుకెళ్లాలన్నారు. కోట్లాదిమంది ఉపాధి పొందుతున్న ట్రాన్స్‌పోర్టు రంగంలో ఎంవి యాక్ట్‌ సవరణ ద్వారా ప్రైవేట్‌ కంపెనీలు లాభాలే పరమావధిగా విపరీతంగా ఆయిల్‌ ధరలు పెంచుతున్నారన్నారు. ఈ కారణంగా ఆటోట్రాలీ, టాటా ఏసీలు, గూడ్స్‌ ఆటోల ధరలు, మెయింటినెన్స్‌ విపరీతంగా పెరిగిందన్నారు. దీనికితోడు ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు విపరీతంగా అక్రమ జరిమానాలు విధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సుధాకర్‌, సిఐటియు నాయకులు టి.సుబ్రమణ్యం, నగర ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్‌, అధ్యక్షులు పి.మునిరాజా, పి.బుజ్జి, పి.చిన్నా, ఎ.రాధాక్రిష్ణ, యూనియన్‌ నాయకులు వాసు, సురేష్‌, బాదుల్లా, గంగాధరం, ఎన్వీ రమణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న జీబిఎస్‌ మణ్యం

➡️