ఆడుదాం ఆంధ్ర’కు పకడ్బందీ ఏర్పాట్లు

Dec 27,2023 21:32

ప్రజాశక్తి-బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరం : ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు పకడ్బం ధీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఆమె బుధవారం బొబ్బిలి, రామభద్రాపురం, గజపతినగరం మండలాల్లో పర్యటిం చారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను, ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట లో బ్యాడ్మింటెన్‌, పాతబొబ్బిలిలో వాలీబాల్‌ పోటీలను కలెక్టర్‌ పరిశీలించారు. రామభద్రపురం జెడ్‌పి పాఠశా లలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటెన్‌, కబడ్డీ పోటీలను, ఆరికతోట నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీలను, గజపతిన గరం మండలం మరుపిల్లి జెడ్‌పి పాఠశాలలో నిర్వహి స్తున్న కబడ్డీ, వాలీబాల్‌, బ్యాడ్మింటెన్‌, ఖోఖో పోటీలను కలెక్టర్‌ తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ, క్రీడలు జరుగుతున్నప్పుడే వెంటవెంటనే ఫోటీ లను, వివరాలను, లైవ్‌ స్కోర్‌ను ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. పర్యటనలో బొబ్బిలి మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, తాహశీల్దార్‌ డోల రాజేశ్వరరావు, ఎంపిడిఒ పి.రవికుమార్‌, రామ భద్రాపురం ప్రత్యేకాధికారి గోవిందరావు, తాహశీల్దార్‌ సులోచనా రాణి, ఎంపిడిఒ రమామణి, గజపతినగరం ప్రత్యేకాధికారి రమేష్‌, ఎంపిడిఒ కె.కిశోర్‌కుమార్‌, ఆయా మండలాల ఎంఇఒలు, పిఇటిలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.’

➡️