ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలరు : హెచ్‌ఎం

ప్రజాశక్తి – ముసునూరు

అవసరాల గల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో వున్నప్పుడే ఏదైనా సాధించగలరని ప్రధానోపాధ్యాయులు ఎం.హన్నామణి అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మండల విద్యాశాఖాధికారి బివి.సుబ్బారావు చేతుల మీదగా సోమవారం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కొండేటి విజయలక్ష్మి, ఐఆర్‌టి ఉపాధ్యాయులు డిఎంవి.లక్ష్మినారాయణ, జె.నాగమల్లేశ్వరి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️