ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపుతా : ఉగ్ర

ప్రజాశక్తి -కనిగిరి : తనను ఆదరిస్తే కనిగిరి నియోజకవర్గాన్ని అభివద్ధి చేసి చూపిస్తానని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో టిడిపి పట్టణ అధ్యక్షుడు తమ్మనేని శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన టిడిపి విస్తత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ సరైన పాలకుడిని ఎన్నుకొకపోతే భవిష్యత్తు తరాలకు నష్టం కలుగుతుందన్నారు. ప్రతి టిడిపి కార్యకర్త 100 ఓట్లకు బాధ్యత తీసుకుని పనిచేస్తే కనిగిరి నియోజకవర్గంలో టిడిపి జండాను ఎగుర వేయవచ్చునని తెలిపారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. నాయకులు అందరినీ సమన్వయంతో కలుపుకుపోవాలన్నారు. వైసిపి అరాచక పాలన, విధ్వంసాలను ప్రజల్లోకి విస్తతంగా తీసుకువెళ్లి రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయానికి అందరూ కషి చేయాలన్నారు.అనంతరం బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టాప్‌ 5లో నిలిచిన బూత్‌ ఇన్‌ఛార్జులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు రాచమల్ల శ్రీనివాసరెడ్డి, షేక్‌ ఫిరోజ్‌, షేక్‌ అహ్మద్‌, చింతలపూడి తిరుపాలు, ఐవి.నారాయణ, గుడిపాటి ఖాదర్‌, బుల్ల బాలబాబు, కరణం అరుణ, తమ్మినేని శ్రీనివాసరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, సద్గురు, జాన్సన్‌ పాల్గొన్నారు.

➡️