ఆదిత్యలో మిలాన్‌-2-23 సంబరాలు

Dec 30,2023 22:23 #ఆదిత్య
ఆదిత్యలో మిలాన్‌-2-23 సంబరాలు

ప్రజాశక్తి-గండేపల్లిసూరంపాలెం ఆదిత్య విద్యా ప్రాంగణంలో ఆదిత్య సిబ్బంది కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం మిలాన్‌-2023 శనివారం ఉత్సాహంగా సాగింది. పిల్లలకు పలురకాల చిరుతిండ్లతో పాటు బహుమతులు అందించారు. ఆదిత్యలో సేవలందిస్తున్న సిబ్బందిని ఘనంగా సత్కరించారు. 23 ఏళ్ల క్యాంపస్‌ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. ఆదిత్య అధినేత డాక్టర్‌ నల్లమిల్లి శేషారెడ్డి ఆదిత్య ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆదిత్య సిబ్బందిచే ప్రదర్శించిన స్కిట్‌లు, సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా జెఎన్‌టియుకె రెక్టార్‌ డాక్టర్‌ కెవి.రమణ పాల్గొన్నారు. డాక్టర్‌ సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ సిబ్బంది సహకారం సంస్థ మనుగడకు తోడ్పాటు అందిస్తోందన్నారు.

➡️