ఆదోనిలో భూక‌బ్జాల‌పై న్యాయ విచార‌ణ జ‌రిపించాలి

Nov 29,2023 14:53 #Kurnool
protest against land occupation in adoni

ప్రజాశక్తి-ఆదోని : ఆదోనిలో జరుగుతున్న భూ కబ్జాలు, మట్కా, పేకాట, అక్రమ మద్యం, ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, అసంఘిక కార్యక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జర్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే అజయ్ బాబు, సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావిరాజు డిమాండ్ చేశారు. బుధ‌వారం ఆదోని అంబేద్కర్ విగ్రహం వ‌ద్ద సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ అధ్యక్షతన‌ పెద్ద ఎత్తున ధర్నానిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఇటీవల కాలంలో భూకబ్జాలు, సెటిల్మెంట్లు పేరుతో అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇద్దరు ఏకమై పట్టణాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిర్దోషిగా ప్రకటించుకోవడం సమస్యకు పరిష్కారం కాదని, ప్రజలకు జరుగుతున్నఅన్యాయాన్ని గుర్తించి, సర్వే నెంబర్ 352తోపాటు పట్టణంలో ఎక్కడ ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు జరిగాయో తెలుసుకొని లబ్ధిదారులను సమీకరించి వారి స్థలాలు వారికి ఇచ్చిన రోజే మీపై ఉన్న ఆరోపణలను కనుమరుగవుతాయని సూచించారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్న రెవిన్యూ అధికారులుగాని, మున్సిపల్ అధికారులుకాని బాధితులకు న్యాయం చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారని, న్యాయ విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయవలసిన అవసరం ఉందన్నారు. తక్షణమే స్పందించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున కలిసి వచ్చేరాజకీయ పార్టీలను సమీకరించుకొని ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి విజయ్ కుమారస్వామి హర్షద్ ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వెంకన్న భీమేష్ జిల్లా సహాయ కార్యదర్శి ఓ బి నాగరాజు, షేక్షావలి, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ అంజిత్ గౌడ్ ఇన్సర్ఫ్ కమిటీ నాయకులు మెకానిక్ వలి, సద్దాం ,దూద్ పీ రా, సిపిఐ నాయకులు శ్రీనివాసులు రవి నాగరాజు ఉన్నారు.

➡️