ఆధునిక పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు

Jan 5,2024 21:28

 ప్రజాశక్తి – కురుపాం : రైతులు ఆధునిక పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని అసోసియేట్‌ డైరక్టర్‌ అఫ్‌ రీసెర్చ్‌ (ఆర్‌ఎఆర్‌ ఎస్‌ చింతపల్లి) డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం శివన్నపేటలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల నైరా విద్యార్థులు ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన, రైతు సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆధునిక పంటలపై మక్కువ చూపి దృష్టి సారిస్తే అధిక ఆదాయాన్ని పొందుతారన్నారు. అలాగే రస్తాకుంటుబాయిలో గల కృషి విజ్ఞానకేంద్రంలోని వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే మరింత దిగుబడులు పొందువచ్చని అన్నారు. అనంతరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వ్యవసాయ ప్రదర్శనలు సందర్శించారు.ఈ కార్యక్రమంలో కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ పాత్రో, కెవికె శాస్త్రవేత్తలు, అసిస్టెంట్‌ డైరక్టర్‌ ఆఫ్‌ వ్యవసాయ కళాశాల ఉపాధ్యాయులు డాక్టర్‌ చిన్నంనాయిడు, వ్యవసాయశాఖ ఎడిఎ నిర్మలజ్యోతి, స్థానిక ఉపసర్పంచ్‌ షేక్‌ ఆదిల్‌, రైతులు మరియు వ్యవసాయ కళాశాల విదార్థులు పాల్గొన్నారు .

➡️