ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోం చేసుకోండి

ఆరోగ్యసురక్ష

డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ జగదీశ్వరరావు

‘ప్రజాశక్తి -ఆనందపురం: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రజలంతా ఉపయోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని గొట్టిపల్లిలో నిర్వహిస్తున్న ఆరోగ్యసురక్ష వైద్యశిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పెషలిస్ట్‌ వైద్యసేవలు గ్రామాల్లో ప్రజలకు చేరువ చేయాలన్నా సంకల్పంతో ప్రభుత్వం ఈ శిబిరాలను నిర్వహిస్తోందన్నారు. వైద్యశిబిరాల్లో గుర్తించిన రోగులకు మెరుగైన సేవలు అవసరమైతే ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే చర్యలు చేపడతామన్నారు. వైద్యశిబిరంలో సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గొట్టిపల్లిలో 324 మందికి వైద్య సేవలు అందించారు.. కార్యక్రమంలో ఆరోగ్య సురక్ష జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ బి. ఉమాపతి, సర్పంచ్‌ గంటా జగదీశ్వరరావు, వైసిపి నేతలు ఇ.వెంకటరావు (జగన్‌), ఆనందపురం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ గంగునాయుడు, సిహెచ్‌ఒ సాంబమూర్తి, హెచ్‌ఎస్‌ పార్వతమ్మ పాల్గొన్నారు.

వైద్యశిబిరాన్ని సందర్శించిన డిఎంహెచ్‌ఒ

➡️