‘ఆర్‌ఎంపిల సేవలు అవసరం’

 ప్రజాశక్తి-ఆనందపురం: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపిల సేవలు ఎంతో అవసరమని ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు జంగం జోషి చెప్పారు. మండలంలోని వెళ్లంకిలో స్థానిక గ్రామీణ వైద్యులు పచ్చిపులుసు కనకారావు సహకారంతో ఆర్‌ఎంపిల ఆవశ్యకతపై ప్రజావేదికను అదివారం నిర్వహించారు. ఈ సభకు ఆర్‌ఎంపి రాష్ట్ర ఫెడరేషన్‌ ముఖ్య సలహాదారులు, ఐఎంఎ ప్రతినిధి డాక్టర్‌ ఎన్‌ఎల్‌.రావు హాజరై ప్రజల స్పందనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జంగం జోషి మాట్లాడుతూ, 60 ఏళ్లకు పైగా గ్రామాలోల ఆర్‌ఎంపిలు వైద్యసేవలు అందిస్తున్నారని, వీరి సేవలను గుర్తిస్తూ ఇటీవల ప్రభుత్వం జిఒ 429ను జారీ చేసినా, అమలులో పారదర్శకత లోపించిందన్నారు. ఆర్‌ఎంపిలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యానికి అర్హత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత విఆర్‌ఒ కె.దామోదర్‌రావు, ప్రసాద్‌ పట్నాయక్‌, ఎన్‌.సుగుణేశ్వరి, పోతిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పడాల వినోద్‌ కుమార్‌, కె.ఎన్‌.రావు, గోట్టుముక్కల రఘుబాబు, పడాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️