ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

కైకలూరు : సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో ఛైర్మన్‌, సిఇఒ ఆదేశానుసారంగా నాబార్డ్‌ సౌజన్యంతో డిజిటల్‌ ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో గ్రామీణ, పట్టణ ప్రజలకు సహకార కేంద్ర బ్యాంక్‌ అందిస్తున్న వివిధ రకాల రుణ సౌకర్యాలు, ప్రతి ఒక్కరు కూడా పొదుపు ఖాతా తెరవాలని, పొదుపు ఖాతా కలిగి ఉండడం వలన అనేక లాభాలు పొందవచ్చని వివరించారు. బీమా వల్ల కలిగే లాభాలు, తదితర అంశాలపై కళాజాత బృందం ద్వారా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బ్రాంచి మేనేజర్‌, సొసైటీ ప్రెసిడెంట్‌ స్తోత్రరాజు, తిరుపతి కుమార్‌, సాయికృష్ణ పాల్గొన్నారు.

➡️