ఆర్‌బికెను సందర్శించిన వియత్నాం బృందం

వియత్నాం ప్రతినిధుల బృందం

ప్రజాశక్తి -ఆనందపురం: మండలంలోని వేములవలస రైతుభరోసా కేంద్రాన్ని వియత్నాం ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించింది. ప్రకృతి వ్యవసాయం విధానంలో చిరుధాన్యాల సాగు, పొలంబడి నమూనాలను ప్రదర్శించగా వాటిని తిలకించారు. ఈ సందర్భంగా వియత్నాం ప్రతినిధుల బృందానికి వ్యవసాయశాఖ అధికారులు దీనిపై వివరించారు. అమరావతి నుంచి వచ్చిన వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు శ్రీధర్‌, ఉప సంచాలకులు వేంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి కె.అప్పలస్వామి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మన్మధరావు, వెటర్నరీ డిడి డాక్టర్‌ కరుణాకర్‌, ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎ.మోహన్‌రావు, వ్యవసాయశాఖ ఎడి డాక్టర్‌ బొడ్డేపల్లి విజయప్రసాద్‌, జిల్లా వనరుల కేంద్రం ఎడిఎ సిహెచ్‌ సుబ్రమణ్యం, మండల వ్యవసాయ అధికారులు. సిహెచ్‌ సంధ్య రత్నప్రభ, బి.శివకోమలి, ఎవిఎస్‌.చలం, వేములవలస అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ షేక్‌ అహ్మద్‌గౌస్‌, మండల వ్యవసాయ సలహామండలి సభ్యులు కోరాడ రాంబాబు పాల్గొన్నారు .

చిరుధాన్యాల సాగును పరిశీలిస్తున్న వియత్నాం బృందం

➡️