ఆర్‌బికెల్లో పురుగు మందులు పంపిణీ

Feb 2,2024 21:11

ప్రజాశక్తి – బలిజిపేట : మండలంలోని పదమాయవలస రైతు భరోసా కేంద్ర పరిధిలో గల చాకిరాపల్లిలో జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌ పాల్‌ సమక్షంలో పురుగుమందులు రైతులకు శుక్ర వారం పంపిణీ చేశారు. ఇకపై రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు రైతులకు అందించడం జరుగుతుందన్నారు. వీటితోపాటు ప్రస్తుతం పురుగు మందులు కూడా రైతులకు అందజేస్తామన్నారు. ముందస్తుగా రైతులకు ఏ పంటలకు ఏ రకమైన తెగులు పురుగు మందులు అవసరమో గుర్తించి ఆ మందుల పూర్తి ఖరీదును రైతు భరోసా కేంద్రం ద్వారా ఎపి సీడ్స్‌ వారికి నగదు రుపేనా జమచేసి ఇండెంట్‌ పెడుతున్నామన్నారు. ఆ ఇండెంట్‌లో పెట్టిన పురుగు లేదా తెగులు మందులను మన గ్రోమోర్‌ సెంటర్‌ (కోరమండల్‌) ద్వారా ఆర్‌బికెల్లో పెట్టి రైతులకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వేపనూనె, క్లోరిపైరీపాస్‌ మందులను సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో వరి, మొక్కజొన్న పంటకు ఏ రకమైన పురుగు, తెగులు మందులు అవసరమో ముందస్తుగా రైతులు ఆర్‌బికెలకు తెలియజేసిన పక్షంలో వీటిని కూడా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కురిటి మోహన్‌, మండల వ్యవసాయ అధికారి శ్రావణ్‌ కుమార్‌ నాయుడు, విఎఎ చోడవరపు కామేష్‌, కోరమండల్‌ కంపెనీ ఎఎంఆర్‌ఒ మహేష్‌, బలిజిపేట గ్రోమోర్‌ మేనేజర్‌ నాగరాజు పాల్గొన్నారు.

➡️