నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు

ప్రజాశక్తి-దర్శి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, టిడిపి తాళ్లూరు మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ దారం నాగవేణి, సుబ్బారావు, నియోజకవర్గ ఐటిడిపి కన్వీనర్‌ ఎస్‌వి.రామయ్య, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు చిన్నా, కొండారెడ్డి, రమేష్‌, బడే, గుర్రం బాలకష్ణ, కల్లూరి సుబ్బు, తానం చింతలమల్లి, తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️