ఆసుపత్రిలో ప్రసవాలే తల్లీబిడ్డకు సురక్షితం

దారకొండ పిహెచ్‌సిలో బర్త్‌ వెయిటింగ్‌ హాల్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, పిఒ

పాడేరు ఐటిడిఎ పిఒ అభిషేక్‌, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ప్రజాశక్తి -సీలేరు

ఆసుపత్రిలో ప్రసవాలు చేయిస్తే తల్లీబిడ్డలకు సురక్షితమని పాడేరు ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌, పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. దారకొండ ప్రాథమిక ఆరోగ్య క్దేంరం వద్ద ఎన్‌హెచ్‌ఎం నిధులు రూ.30 లక్షలతో నిర్మించిన బర్త్‌ వెయిటింగ్‌ హాలును సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఒ అభిషేక్‌ మాట్లాడుతూ గర్భవతులు ప్రసవ సమయానికి వారం రోజులు ముందుగానే బర్త్‌ వెయిటింగ్‌ హాలులో చేరి వైద్యుల పర్యవేక్షణలో ప్రసవించాలని సూచించారు. ధారకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి రూ.13 లక్షల వ్యయంతో అంబులెన్సు సమకూర్చామని చెప్పారు. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే వెంటనే అంబులెన్సును పంపించి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజనుల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అవగాహన లోపంతో ప్రసవ సమయానికి ఆసుపత్రిలో చేరక తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి విఎస్‌.ప్రభాకరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జమాల్‌బాషా, ఆసుపత్రి వైద్యాధికారి డికె.హిమబిందు, సర్పంచ్‌ రాజు, ఎంపిటిసి సాంబమూర్తి పాల్గొన్నారు.దారాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపనసీలేరు : జికె.వీధి మండలం దారకొండ దారాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, ఐటిడిఓ పిఓ అభిషేక్‌, దేవాదాయశాఖ ఈవో సాంబశివరావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయశాఖ రూ.50లక్షలు మంజూరు చేసిందని చెప్పారు. ముందుగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పివో అభిషేకం దారాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిని ఎండోమెంట్‌ అధికారి సాంబశివరావు దుస్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీలేరు ఎంపిటిసి పిల్ల సాంబమూర్తి, వైసిపి నాయకులు వెంకట్రావు, ఆలయ పూజారి ప్రసాదు పాల్గొన్నారు.దారకొండ ఆశ్రమ పాఠశాల సందర్శనసీలేరు : గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని పాడేరు ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌ అన్నారు. దారకొండ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ డిగ్రీలతోపాటు, ఇంజనీరింగ్‌, మెడికల్‌ వంటి వృత్తి విద్యా కోర్సులను అభ్యసించాలని సూచించారు. 9వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠ్యాంశాలను, పదవ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలను బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టోర్‌ రూమును, నిత్యవసర సరుకులను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. కడుపునొప్పి వల్ల కేజీహెచ్‌లో ఆపరేషన్‌ చేయించుకొని సిక్‌ రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పదో తరగతి విద్యార్థి సీస చందును పిఒ పరామర్శించారు. విశ్రాంతి తీసుకుంటూ చదువుకోవాలని, ధైర్యంగా ఉండాలని సూచించారు. పిఒ వెంట ఎపిఒ విఎస్‌ ప్రభాకర్‌రావు, సహాయ గిరిజన సంక్షేమ అధికారి తదితరులున్నారు.

➡️