ఇంటింటా ‘ఇంటూరి’ ప్రచారం

Dec 30,2023 19:13
ప్రచారం చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రచారం చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు
ఇంటింటా ‘ఇంటూరి’ ప్రచారం
ప్రజాశక్తి-కందుకూరు :సిఎం జగన్మోహన్‌రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, సూట్‌ కేస్‌ కంపెనీలు సష్టించి వేల కోట్లు దోచుకోబట్టే 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చిందని, ఒక్క ఛాన్స్‌ అని చెప్పి రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా దోచుకున్నాడని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కందుకూరు పట్టణంలోని 4వ వార్డు జనార్ధనస్వామి గుడి, నల్ల మల్లి వారి తోట ప్రాంతాల్లో శనివారం నిర్వహించారు. నాగేశ్వరరావు మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు.స్థానికుల నుంచి స్పందన కనిపించింది. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు మచ్చా మనోహర్‌ నాయకులు వలేటి వెంకటేశ్వర్లు, గుమ్మా శివ, నందికనమల లక్ష్మణరావు, బొల్లినేని నాగేశ్వరరావు, వెల్లంపల్లి కష్ణ, నారాయణ జయరాం, మణికంఠ, పార్టీ నాయకులు చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్‌, రాయపాటి శ్రీనివాసరావు, రెబ్బవరపు మాల్యాద్రి, పొడపాటి మహేష్‌, షేక్‌ మున్నా, చుండూరి శీను, ముచ్చు వేణు, షేక్‌ సలాం, సవిడిబోయిన వెంకటకష్ణ, పులి నాగరాజు, షేక్‌ ఫిరోజ్‌, ఫాజిల్‌, షేక్‌ ఖలీల్‌, షేక్‌ మమ్ముషా, కాలేషా, రసూల్‌, ముప్పవరపు వేణు, అత్తోట మాల్యాద్రి, రామ్మూర్తి, దాసరి ప్రమోద్‌, షేక్‌ మమ్ముషా, సవలం కేశవులు ఉన్నారు.

➡️