ఇవిఎం గోడౌన్‌పై పటిష్టమైన నిఘా : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాకు సంబంధించిన ఇవిఎంలను భద్రపరిచిన గోడన్‌ వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రాయచోటి పట్టణం మార్కెట్‌ యార్డ్‌లో ఉన్న ఇవిఎం గోడౌన్‌ను గురు వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ తనిఖీ చేశారు. గోడౌన్‌ లోపల భద్రపరిచిన ఇవిఎం యంత్రాలు బియులు, సియులు, వివి ప్యాట్‌లను, అక్కడి భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు మొత్తంగా 4893 బియులు, 4220 సియులు, 4847 వివి ప్యాట్‌లు వచ్చాయని వీటన్నిటిని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే మొదటి దశ తనిఖీ పూర్తి చేసినట్లు తెలిపారు. 4817 బియులు బాగున్నాయని, 76 మరమ్మతుకు వచ్చాయని, 4140 సియులు బాగున్నాయని తెలిపారు. 80 మరమ్మతులకు, 4770 వివి ప్యాట్‌ బాగున్నాయని, 77 డిఫెక్ట్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. లోపపూరితంగా ఉన్న బియులు, సియులు, వివి ప్యాట్‌లను వెనక్కి పంపినట్లు చెప్పారు. ఇవిఎం యంత్రాలకు కల్పించిన భద్రత పట్ల రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతప్తిని వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్‌ సమాధానం ఇచ్చారు. కార్యక్రమం లో డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్‌డిఒ రంగస్వామి, తహశీల్దార్‌ ప్రేమంత్‌కుమార్‌, ఎన్నికల సెల్‌ సూపరిం టెండెంట్‌ కష్ణమోహన్‌, టిడిపి భానుగోపాల్‌రాజు, బిజెపి శివప్రసాద్‌, బిఎస్‌పి యుగంధర్‌, జనసేన రియాజ్‌, ఐయుఎంఎల్‌ ఎస్‌ఎస్‌ బాషా, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.రాజకీయ ప్రతినిధులతో కలిసి ఇవిఎం గోడౌన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

➡️