ఇవిఎం ప్రదర్శన కేంద్రం ప్రారంభం

ప్రజాశక్తి- రాయచోటి ఇవిఎంల ద్వారా ఓటు వేసే విధానాన్ని ఓటర్లకు వివరించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇవిఎం ప్రదర్శన కేంద్రాన్ని శనివారం కలెక్టర్‌ గిరీష పిఎస్‌ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ ఇవిఎం ప్రదర్శన కేంద్రంలో ఉన్న కొంతమంది ప్రజలకు ఓటు వేసే విధానాన్ని ఓటు వేయించి వివరించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటరు, పోలింగ్‌ యూనిట్‌ మీద ఉన్న పేర్లలో తాను ఎన్నుకోవాలనుకున్న వ్యక్తి పేరుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్‌ను నొక్కి నప్పుడు ఓటు వేసినందుకు గుర్తుగా ఎరుపు రంగు బల్బు వెలుగుతుందని, అనం తరం ఓటరు ఎంచుకున్న అభ్యర్థి సీరియల్‌ నెంబరు, పేరు, గుర్తు, తదితర వివరాలతో కూడిన బ్యాలెట్‌ కాగితం వివి ప్యాట్‌ మిషన్‌లో ఏడు సెకండ్ల పాటు చూపిస్తుందని వివరించారు. ఓటు వేసినందుకు గుర్తుగా శబ్దం వినపడకపో యినా లేదా ఎరుపు రంగు బలుపు వెలగకపోయినా, ముద్రించబడిన కాగితం చూపించక పోయినా, సంబంధిత పోలింగ్‌ అధికారికి ఓటర్లు తెలపాలని సూచిం చారు. ఇవిఎం ప్రదర్శన కేంద్రంలోకి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇవిఎం ద్వారా ఓటు వేసే విధానాన్ని వివరించాలని ప్రదర్శన కేం ద్రంలోని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, ఎఒ బాలకష్ణ, ఎలక్షన్‌ సెల్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

➡️