ఇష్టంతో కష్టపడితే ఫలితాలు సాధ్యం

Dec 21,2023 23:36
ప్రస్తుత పోటీ ప్రపంచంలో

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు పట్ల ఇష్టంతో కష్టపడితే మంచి ఫలితాలు సాధించవచ్చునని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. రూరల్‌ మండలం ధవళేశ్వరం జడ్‌పి బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఉచిత ట్యాబ్‌ల పంపిణీ జరిగింఇ. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌ రెడ్డి విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చి డిజిటల్‌ బోధనా విధానాన్ని అందించడం జరిగిందన్నారు. పాఠశాలల అభివృద్ది అత్యంత ప్రాధాన్యతనిస్తూ నాడు – నేడు పనులు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చారన్నారు. గోరుముద్ద పధకం ద్వారా పౌష్టి కాహారాన్ని అందిస్తూ బాలబాలికలకు మధ్యాహ్న భోజన పథకంతోపాటు, రక్తీహీనతకు గురికాకుండా చిక్కీలను అందిస్తూ వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతు న్నారన్నారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లితండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లుల ఖాతాల్లో రూ.15 వేల జమ చేస్తున్నారని అన్నారు. ఉన్నత స్థాయిలోనికి ఎదగాలంటే కష్టపడే తత్వం పట్టుదల, లక్ష్యాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఏదీ కష్ట పడకుండా సాధించలేమని, ఈ రోజు నేను కలెక్టరుగా ఉన్నానంటే నిరంతరం పట్టుదల కృషితో మాత్రమే అది సాధ్యమైందన్నారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల విద్యా ప్రయోజనం కోసం ఈ ఏడాది రు.48.67 కోట్లతో 15,210 మంది విద్యార్థులకు ట్యాబ్‌ల అందిస్తున్నామన్నారు. గత ఏడాది రూ.56.80 కోట్లతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలపి 17,736 ట్యాబ్‌లను అందిచామన్నారు. టాబ్స్‌ ద్వారా యానిమేటెడ్‌ వీడియోలు, క్విజ్‌లు మరియు మరిన్నింటి ద్వారా అభ్యాసాన్ని ఇంటరాక్టివ్‌, విద్య పట్ల సమగ్ర దృక్పథంతో, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేసిందన్నారు.

➡️