ఇసుక అక్రమ రవాణాకు అడ్డేలేదు..

Mar 19,2024 21:31

ప్రజాశక్తి – మక్కువ : మండలంలోని సువర్ణముఖి నది గర్భంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డే లేకుండా పోతుంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటికీ ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఏ విధమైన అనుమతుల్లేకుండానే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని దేవరశిర్ల్లాం సమీపాన ఇసుకరీచ్‌ ఉంది. దీనికి ప్రభుత్వం అనుమతితో ఇసుకను తోలుకునేందుకు ట్రాక్టర్లకు అవకాశం కల్పించారు. అయితే ఈ రీచ్‌కు అనుమతులు తీసుకున్నామంటూ అక్రమంగా కొత్తవలస ఎగువ భాగం నుండి వెంకట బైరిపురం, దేవరశిర్లాం ఎత్తిపోతల పథకాల వరకు సువర్ణముఖి నది గర్భమంతా యథేచ్చగా ఇసుకను దోచేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే గుడిలకు, గోపురాలకంటూ అబద్దాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇక్కడి నుంచి పార్వతీపురం జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలకు ప్రధాన రహదారి గుండా అక్రమంగా ఇసుక రవాణా సాగుతూనే ఉంది. ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు సమీపాల్లోని నదుల్లో ఇసుక తీయకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇసుక మాఫియా వీటిని బేఖాతర చేస్తూ అక్రమంగా తరలించకపోతున్నా అధికారులు, పోలీసులెవరూ పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారుమాఫియా అతడే సూత్రధారి..?సువర్ణముఖి నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా మాఫియాగా ఏర్పడ్డానికి సుమారు నాలుగు గ్రామాలకు చెందిన ట్రాక్టర్‌ యజమానులను ఏకం చేస్తూ మండలంలోని ఓ వ్యక్తి మాఫియాకు సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు ట్రాక్టర్లకు యాజమానిగా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తి మిగతా వారిని కూడా తనకు అనువుగా కలుపుకొని ఈ దందాలో వారిని భాగస్తులుగా చేస్తున్నాడని వివిధ శాఖల అధికారులు కూడా ఆయన ద్వారా ముడుపులు అందుతున్నాయని ఆరోపణలు మండలంలో వ్యాపించాయి.రీచ్‌ వైపు చూస్తే డ్యామ్‌లో పడేస్తా?ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతం వైపు వార్తాసేకరణకు ఏ ఒక్క విలేకరి వచ్చినా, అటువైపు కన్నెత్తి చూసినా ఆనకట్టలో పడేస్తామని మాఫియాకు చెందిన వ్యక్తి బెదిరింపు చర్యలకు పాల్పడుతూ, మరోవైపు తన అనుకూల వ్యక్తులతో ప్రచారం ముమ్మరం చేశాడు. ఇసుక మాఫియాకు అడ్డే లేదన్నట్లు ఈ ప్రచారంతో మరింత బలం చేకూర్చేలా ఉందని, ఇలాంటి బెదిరింపులకు దిగడం వెనుక బలమైన వ్యక్తులు అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయిజమడతోటరేవు ది మరో ట్విస్ట్‌మండలంలోని వెంకటబైరిపురం ఎత్తిపోతల పథకం సమీపానున్న మడతోట రేవు ఇసుక రీచ్‌ది మరో కథ. ఇక్కడ నుంచి నాటు బండ్ల ద్వారా ఇసుకను సుమారు 100 మీటర్ల వరకు తోట వద్దకు ఇసుకను డంపు చేసి అక్కడ నుండి నేరుగా ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. నాటు బండ్ల యజమానులకు ఒక ట్ట్రాక్టర్‌ ఇసుకను నింపేందుకు సుమారు రూ.800 అందజేస్తారు. ఎలాంటి పనుల్లేకపోవడంతో తాము ఇసుకను తరలించుకుంటూ జీవనం సాగిస్తున్నామని బండ్ల యజమానులు విలేకరులకు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ఇసుక అక్రమ దందాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు

➡️