ఈవీఎంల వినియోగంపై అవగాహన

Feb 7,2024 22:00

ఈవీఎంల వినియోగంపై అవగాహన
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌, కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్‌ కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరు గాంధీ విగ్రహ కూడలిలో భారీ ఈవీఎం నమూనాలు ఏర్పాటు చేశారు. ఏఈఆర్వో, కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ ఆధ్వర్యంలో అధికారుల బందాలు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరం మధ్యలో గాంధీ విగ్రహ కూడలిలో ఏర్పాటు చేసిన భారీ ఈవీఎం నమూనా ఆకట్టుకుంటోంది. ఈవీఎంలో ఓటింగ్‌ విధానం పై ఈ నమూనా ఆధారంగా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎంలో ఓటు వేసిన సందర్భంలో ఎవరికి ఓటు వేసామో.. వారి పేరు ఎదురుగా లైట్‌ వెలిగేలా ఏర్పాట్లు చేశారు. ఈవీఎం పనిచేసే విధానంపై ఓటర్లకు క్రమం తప్పకుండా అవగాహన కల్పిస్తున్నారు.

➡️