‘ఉగ్ర’ను గెలిపించుకుందాం

Dec 7,2023 23:08

ప్రజాశక్తి-హనుమంతునిపాడు:  రానున్న ఎన్నికల్లో కనిగిరి ఎమ్మెల్యేగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాలని టిడిపి మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి గాయం తిరుపతిరెడ్డి అన్నారు. వైసిపి నేతలు దొంగ ఓట్లు చేర్పించడంలో సిద్ధహస్తులని, తమ మాయమాటలతో ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా తిమ్మారెడ్డిపల్లి, వాలిచర్ల, గ్రామాలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందని అన్నారు. వైసిపి నేతలు అక్రమమార్గంలో గెలిచేందుకే ప్రయత్నిస్తున్నారని, చాలమందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని విమర్శించారు. వాటిని తొలగించాలని అధికారులకు తెలియజేశామని, ఎవరికైనా సరే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి’ అని నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది చంద్రబాబు ఆలోచన అని, వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో వైసీపీ నాయకులు దిట్ట అని విమర్శించారు. వైసీపీ నేతలు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, బోగస్‌ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాయం రామిరెడ్డి, గంగిరెడ్డి రమేష్‌రెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, కూడాలి దశరథ, రాజారెడ్డి, మల్లెల తిరుపతయ్య, కోతుల సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ బూత్‌ ఇన్‌ఛార్జులు తదితరులు పాల్గొన్నారు.

➡️