ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి పరీక్షలు

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పుగోదావరి): లయన్స్‌ క్లబ్‌ మైత్రి తణుకు ఆధ్వర్యంలో కేసావరం పంచాయతీ సర్పంచ్‌ నార్ని రామకృష్ణ తండ్రి నానాజీ జ్ఞాపకార్థం మంగళవారం సూర్యారావు పాలెంలోఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. గ్రామ సర్పంచ్‌ మెండే లలిత కుమారి సొసైటీ ఆవరణలో ప్రారంభించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి సమస్యలకు 100 మంది హాజరు కాగా 40 మందికి కళ్ళజోళ్ళు, 21 మందికి ఆపరేషన్లు అవసరమయ్యాయి. ఆపరేషన్లు, కళ్ళజోళ్ళు ఉచితంగా అందజేయబడతాయని లయన్స్‌ క్లబ్‌ సభ్యులు తెలిపారు. జనరల్‌ పరీక్షలు 102 మందికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైత్రి లయన్స్‌ క్లబ్‌ తణుకు, అధ్యక్షులు గమిని గోపాలకృష్ణ, అక్కా బత్తుల బాలాజీ, ఐ.నాగకృష్ణంరాజు, సమరౌతు సతీష్‌, అక్కల నాగరాజు, కడించర్ల రాజా, లెనిన్‌ శ్రీను, కొరిపల్లి సత్యనారాయణ, కరుటూరి శేషగిరి, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️