ఉత్తమ ఫలితాలు సాధించాలి : డిఇఒ

ప్రజాశక్తి – సంబేపల్లె (రాయచోటి) మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులు, ఉపాధ్యాయుల కషితో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారి శివ ప్రకాష్‌ రెడ్డి అన్నారు. గురువారం సంబేపల్లె పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ముఖ్యమైన భావనలపై, పట్టికలపై, పటాలపై వారికి తర్ఫీదు ఇవ్వడం ద్వారా వారిని కూడా ఉత్తీర్ణులను చేయవచ్చన్నారు. పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి కషి, పట్టదలతో బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి, సర్పంచ్‌ అంచల రామచంద్ర, ఓపెన్‌ స్కూల్‌ కో-ఆర్డినేటర్‌ శ్రీనివాసరాజు, ఎంఇఒ శ్రీనివాసులు, సాయి ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ సుధాకర్‌ రెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ బుజ్జి రెడ్డి, వైసిపి నాయకులు ప్రతాపరెడ్డి, ప్రముఖ లాయర్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️