ఉత్సాహంగా వికలాంగుల ఆటల పోటీలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ప్రజాశక్తి- అనకాపల్లి :అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ గ్రౌండ్లో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనకాపల్లి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పాత్రపల్లి వీరు యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను అనకాపల్లి జిల్లా అడిషనల్‌ ఎస్పీ విజయభాస్కర్‌, వికలాంగులు, వద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.వి.జి జగదీష్‌ చేతులమీదుగా జండా ఊపి ఆటల పోటీలను ప్రారంభించారు. అంగవైకల్యం, అంధులు, బధిరులు, మానసిక వికలాంగులు ఇలా నాలుగు విభాగాలుగా ఈ ఆటల పోటీలను ట్రై సైకిల్‌ రేస్‌, బ్యాటరీ ట్రైసైకిల్‌ రేస్‌, రన్నింగ్‌, జావ్లీన్‌ త్రో, డిస్క్‌ త్రో, షాట్‌ పుట్‌, క్రికెట్‌, క్యారమ్స్‌, చెస్‌, సింగింగ్‌ నిర్వహించారు. విజేతలకు ఏడి జగదీష్‌ బహుమతులను అందజేశారు. ఆటలపోటీల్లో 400 మంది వికలాంగులు పాల్గొన్నారని వీరు యాదవ్‌ తెలిపారు. ఈ పోటీలను ఎస్‌.డి గ్రూప్స్‌ అధినేత కాండ్రేగుల శ్రీరామ్‌, జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆడారి రవికుమార్‌, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు నాలం ఆశకుమారి, విజువల్లి చాలెంజర్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ కొరుప్రోలు వెంకటేశ్వరావు, తుమ్మపాల జెడ్‌పి హైస్కూల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ రవితేజ, గుడివాడ వరలక్ష్మి కోటవురట్ల, అమరపల్లి సిహెచ్‌.రామన్‌ రారు డిఫెన్స్‌, శరగడం సూర్య ప్రకాష్‌, కరెంట్‌ ఆఫీస్‌, తుమ్మపాల ఈశ్వర అప్పారావు సహకారంతో నిర్వహించినట్టు వీరు యాదవ్‌ తెలిపారు. వికలాంగుల సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వికలాంగుల సంక్షేమశాఖ ఎడి అన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ కనిశెట్టి సురేష్‌ బాబు, సిపిఐ నాయకులు రాజాన దొరబాబు, సూదికొండ మాణిక్యం, ఏఐవైఎఫ్‌ నాయకులు వియ్యపు రాజు, సంఘం కార్యదర్శి మొల్లి చంద్రశేఖర్‌, కోరుకొండ నాగరాజు పాల్గొన్నారు.

విజేతలకు బహమతుల ప్రదానంచేస్తున్న ఎఎస్‌పి, ఎడి

➡️