ఉత్సాహంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు

Dec 10,2023 23:24
వెయిట్‌ లిఫ్టింగ్‌

ప్రజాశక్తి – రాజానగరం
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరుగుతున్న సౌత్‌ అండ్‌ వెస్ట్‌ జోన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం రెండో రోజుకు చేరాయి. పలు విభాగాల్లో క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన ప్రథమ, ద్వితీయ, తతీయ క్రీడాకారులకు వీసీ ఆచార్య కె.పద్మరాజు, రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌, విశ్వవిద్యాలయ అధికారులు, క్రీడా ప్రముఖులు పతకాలు ప్రదానం చేశారు. సౌత్‌ అండ్‌ వెస్ట్‌ జోన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్షిప్‌

మెన్‌ 55 కేజీ కేటగిరిలో మొదటి మూడు స్థానాలను మహారాష్ట్ర్ర నాందేడ్‌ యూనివర్సిటీ విద్యార్థి ఆకాష్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థి ఇ.కోటేశ్వరరావు, తమిళనాడు తిరువల్లూర్‌ యూనివర్సిటీ విద్యార్థి పి.బాలాజీ పాల్గొన్నారు.

61 కేజీ కేటగిరిలో తిరువల్లూర్‌ యూనివర్సిటీ విద్యార్థి రుతేశ్వర, మంగళూరు యూనివర్సిటీ విద్యార్థి సుబ్ర హ్మణ్యం, రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి ఎస్‌.అబ్దుల్‌ వరుసుగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.

67 కేజీ కేటగిరిలో అన్నా యూనివర్సిటీ విద్యార్థి శ్యామ్‌సుందర్‌రాజు, భారతి విద్యాపీఠ్‌ విద్యార్థి పాండురాంగ్‌, మద్రాస్‌ యూనివర్సిటీ విద్యార్థి సి.దినేష్‌ మొదటి స్థానాల్లో నిలిచారు.

ఉమెన్‌ విభాగం 45 కేజీల కేటగిరిలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థి బి.రాజేశ్వరి ప్రథమ, కోల్హాపూర్‌ శివాజీ యూనివర్సిటీ విద్యార్థి దోనే అపేక్షదత్తరి ద్వితీయ, పూనే సావిత్రి బారు పూలే యూనివర్సిటీ విద్యార్తి హర్షద తతీయ స్థానంలో నిలిచారు.

49 కేజీ కేటగిరీలో కొల్హాపూర్‌ శివాజీ యూని వర్సిటీ విద్యార్థి టి.అరతిరాఘవేంద్ర, ముంబై యూనివర్సిటీ విద్యార్థి దల్వి సౌమ్య, ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థి బి.చంద్రిక తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

55 కేజీల కేటగిరీలో కాలికట్‌ యూనివర్సిటీ విద్యార్థి మానికం షీన్‌, మంగళూరు యూనివర్సిటీ విద్యార్థి యుక్తిక, సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ విద్యార్థి వైష్ణవి జ్ఞానేశ్వరి మొదటి మూడు స్థానాల్లో నిలచారు.

59 కేజీల కేటగిరీలో మద్రాస్‌ యూనివర్సిటీ విద్యార్థి టిఎం.కీర్తన, ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థి ఎం.దీపనయోమి, యోగివేమన యూనివర్సిటీ విద్యార్థి లిజా కంసా మొదటి మూడు స్థానాల్లో నిలిచి బంగారు, వెండి, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.

అనంతరం విదజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నన్నయ విసి ఆచార్య కె.పద్మరాజు, రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌, క్రీడా ప్రముఖులు ఎఐయు అబ్జర్వర్‌ మజర్‌ ఉల్‌ ఖమర్‌, అర్జున అవార్డీ నీలంశెట్టి లక్ష్మీ, వెయిట్‌ లిఫ్టింగ్‌ ఒలింపియన్‌ ఎం.వి.మాణిక్యాలు, విశ్వవిద్యాలయ అధికారులు పి.సురేష్‌ వర్మ, కె.శ్రీరమేష్‌, వై.శ్రీనివాసరావు, డి.జ్యోతిర్మయి, కె.సుబ్బారావు, కె.రమణేశ్వరి, వి.పెర్సిస్‌, బడేటి వెంకటరామయ్య, శ్యామ్‌ కుమార్‌, రామ్‌ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️