ఉదయగిరిలో ఎస్‌పి ఆకస్మిక తనిఖీలు

Mar 26,2024 22:06
ఫొటో : తనిఖీలు చేపడుతున్న ఎస్‌పి తిరుమలేశ్వర్‌రెడ్డి

ఫొటో : తనిఖీలు చేపడుతున్న ఎస్‌పి తిరుమలేశ్వర్‌రెడ్డి
ఉదయగిరిలో ఎస్‌పి ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి-ఉదయగిరి : జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల ఏర్పాటు పరిశీలనపై ఎస్‌పి డాక్టర్‌ కె.తిరుమలేశ్వర్‌ రెడ్డి మంగళవారం ఆయన ఉదయగిరి సిఐ సర్కిల్‌ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18 చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. వాటి ఏర్పాటు పర్యవేక్షణకు 26 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీములు ఏర్పాటు చేసి ఇప్పటికే తనిఖీలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. అందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని చెక్‌ పోస్టులను తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో వేల్పుల గిరిబాబు, ఎస్‌ఐలు కర్నాటి ఇంద్రసేనారెడ్డి, వరికుంటపాడు ఎస్‌ఐ తిరుపతయ్య, దుత్తలూరు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️